chigurumamidi | చిగురుమామిడి, ఏప్రిల్ 6: రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాన్ని స్థాపించడం కోసం ధర్మసమాజ్ పార్టీ (డి.ఎస్.పి) ఆధ్వర్యంలో విశారదన్ మహరాజ్ లక్ష కిలోమీటర్ల రథయాత్ర చేయపడుతున్నాడని, ఈ యాత్ర ఈనెల 14 అంబేద్కర్ జయంతి నుంచి అదిలాబాద్ కేంద్రంగా ప్రారంభించనున్నారని డీఎస్పీ జిల్లా అధ్యక్షుడు తాళ్ల నరేష్ అన్నారు.
మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఎదుట పోస్టర్ ఆవిష్కరణ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా 2028 వరకు జూలై వరకు రథయాత్ర సాగుతుందన్నారు. ఈ యాత్రలో అన్ని గ్రామాల్లో ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురానున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు, 420 హామీలను రథయాత్రలో ఎండబెట్టడం జరుగుతుందన్నారు.
రథయాత్ర ముగింపును హైదరాబాదులో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. పేద ప్రజల సమస్యల పరిష్కారాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సాగు, తాగునీరు అందించడంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. వేలాది ఎకరాల వరి పంటలు ఎండిపోయాయని అన్నారు. పెట్టుబడులకు అప్పులు తెచ్చి పంటలు ఎండి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఎలగందుల అనిల్, ప్రధాన కార్యదర్శి బోయిని శ్రీకాంత్, జిల్లాల సురేష్, కమిటీ సభ్యులు పైస రాజ్ కుమార్, అందే సాగర్, జ్ఞాన శ్రీ మహారాణి పాల్గొన్నారు.