బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా గురువారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రతినిధుల సభ నూతనోత్సాహాన్ని నింపింది. తెలంగాణ భవన్లో అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సభ అట్టహాసంగా జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు తీర్మానాలను ప్రవేశపెట్టగా, ప్రతినిధులంతా ఆమోదించారు.
ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా నుంచి మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. పలువురు సీఎం కేసీఆర్ను కలిసి అభినందనలు తెలిపారు.
Ktr