5
Suicide note | వేములవాడ, జూన్ 24: ‘నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.. నన్ను క్షమించండి నాదే తప్పు… ఏమండీ మీరు నన్ను క్షమించండి.. మీ అమ్మడు మంజు…’ అంటూ ఓ వివాహిత సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వేములవాడ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వేములవాడ పట్టణంలోని గాంధీ నగర్ ప్రాంతంలో గంప మంజుల (58) అనే వివాహిత సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
మృతురాలికి భర్త గంప ప్రసాద్, ఇద్దరు కుమారులు ఉండగా వారి వివాహాలు కూడా జరిగాయి. వృత్తిరీత్యా ఒకరు కరీంనగర్, మరొకరు హైదరాబాద్ లో ఉంటుండగా దంపతులు మాత్రమే వేములవాడలో ఉంటున్నారని స్థానికులు తెలిపారు. అయితే ‘తన చావుకు ఎవరూ బాధ్యులు కారు.. తప్పంతా నాదే… ఏమండీ నన్ను క్షమించండి’ అని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా అందరిని కంటతడి పెట్టించింది. మంగళవారం పోలీసుల శివపంచనామా అనంతరం పోస్టుమార్టం నిర్వహించి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు.