NTPC | జ్యోతినగర్, సెప్టెంబర్ 14: ఎన్టీపీసీలో భూ నిర్వాసితులకు యాజమాన్యం సరైన సమయంలో ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో రిటైర్డుమెంట్ (పోస్ట్ రిటైర్డుమెంట్ మెడికల్ స్కీమ్(పీఆర్‌ఎంఎస్)కు అర్హత లేకుండా పోయిందని, ఐదేండ్ల సర్వీస్ చేసినా కూడా పీఆర్‌ఎంఎస్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేయనున్నట్లు బీఎంఎస్ ఎన్టీపీసీ ఎన్బీసీ మెంబర్ ఎస్ మల్లేశం అన్నారు. ఈ నెల 25న రామగుండం ఎన్టీపీసీలో జరుగు గుర్తింపు సంఘం ఎన్నికల బరిలో నిలిచిన భారతీయ కార్మిక సంఘ్ (బీఎంఎస్)కు మద్దతుగా టౌన్ షిప్ లో ని యూనియన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాజమాన్యం నిర్లక్ష్యంతో సంస్థలో 15ఎళ్ల సర్వీస్ లేక, ఆలస్యంగా ఉద్యోగాలు లభించిన నిర్వాసితులకు పీఆర్‌ఎంఎస్ కు అన్హరులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు. అలాగే సంస్థలో మజ్జూర్లుగా తీసుకోని డబ్ల్యూ 0,1,2 ఆపరేటర్లుగా పనిచేస్తున్న వారికి ఆపరేటర్లుగా పదోన్నతులు కల్పించాలన్నారు. సంస్థలో ప్రతినిధ్య సంఘంగా బీఎంఎస్ ఉన్న లేకున్న కార్మికుల సంక్షేమ ప్రయోజనాలకు పాటుపడుతామన్నారు.
ఈ నెల 25న రామగుండం ఎన్టీపీసీలో జరుగు గుర్తింపు ఎన్నికల్లో బీఎంఎస్ ను గెలిపించాలని కార్మికులను కోరారు. ఇక్కడ భారతీయ కార్మిక సంఘ్ ప్రెసిడెంట్ కేతిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ ఎన్ సాగర్‌రాజు, బీఆర్ఎస్ ఆల్ ఇండియా మహాసంఘ్ ప్రధానకార్యదర్శి మహేశ్, నాయకులు సత్యనారాయణరెడ్డి, పోగుల స్వామి, బండారి కనకయ్య, తదితరులు ఉన్నారు.