NARENDER REDDY | జగిత్యాల, నవంబర్ 17: అకాడమీ ఫీజ్ చెల్లించనిదే పరీక్ష ఫీజ్ తీసుకోమంటూ ఆల్ఫోర్స్ కళాశాల యాజమాన్యం విద్యార్థులను ఆ కళాశాల పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సేవాదల్ రాష్ట్ర కార్యదర్శి బాగోజీ ముఖేష్ కన్నా కలెక్టర్ ను కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జగిత్యాల లోని ఆల్ ఫోర్స్ కళాశాల యాజమాన్యం తమ కళాశాల లో చదివే విద్యార్థులను మానసికంగా వేధిస్తోందాని మండిపడ్డారు. మార్చిలో జరుగనున్న ఫైనల్ ఎగ్జామ్స్ ఫీజ్ చెల్లింపు సమయంలో అకాడమీ ఫీజ్ చెల్లిస్తేనే పరీక్ష ఫీజ్ తీసుకొంటామని విద్యార్థులను బయాందోళనకు, మానసిక ఆందోళన కు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
నిరుపేద కుటుంబాలకు చెందిన ఎందరో విద్యార్థులు ఎన్నో వ్యయ ప్రయాసాలకొర్చి అల్ఫోర్స్ కళాశాలల్లో చదువుకొంటున్నారని, ఇలాంటి విద్యార్థుల కుటుంబాలు ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి అకాడమీ ఫీజ్ లు చెల్లిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను భయాందోళనాలకు గురిచేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆల్ ఫోర్స్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అలాగే పూర్తి విచారణ కై కమిటీని నియమించాలని, ఇదే విషయం పై కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు ముఖేష్ కన్నా పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో పీసీసీ సేవాదల్ సభ్యులు రమణ, కిషోర్, పార్థు, రాహుల్, అరుణ్ తోపాటు పలువురు పాల్గొన్నారు.