పెద్దపల్లి, జనవరి1 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 3న పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కేంద్రానికి రానున్నారు. మొదట తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు.
అనంతరం 12.15 గంటలకు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నివాసంలో నిర్వహించే టీబీజీకేఎస్ నాయకుల ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతారు. ఒంటిగంటకు రంగాపూర్ గ్రామ శివారులోని ఓ ఫంక్షన్హాల్లో కార్మిక నాయకుడు కౌశిక్హరి కూతురు వివాహ వేడుకలో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.