జగిత్యాల, మే 3: జగిత్యాల జిల్లా కేంద్రంలోని నవదుర్గ ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేయూతనందించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నవదుర్గ సేవా సమితి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని మాటిచ్చి.. నేడు నిలబెట్టుకున్నారు. రాజ్యసభ ఎంపీ దీవకొండ దామోదర్‌రావు ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ఆలయ అభివృద్ధి కోసం కోటి రూపాయలు మంజూరు చేయించారు.
ఈ క్రమంలోజడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతసురేశ్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో నవదుర్గ ఆలయ సేవా సమితి సభ్యులకు కోటి రూపాయల నిధులకు సంబంధించిన ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. అమ్మవారి దయ ప్రజలందరిపై ఉండాలన్నారు. నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ దామోదర్‌రావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతసురేశ్కు నవదుర్గ సేవా సమితి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కస్తూరి శ్రీనివాస్, అంగరి నాగరాజు, బూస ఉమాపతి, అనుమల్ల వాసు, అంగరి విజయ్‌కుమార్, సిరిపురపు జితేందర్, గుండేటి వెంకటరమణ, అనుముల చంద్రం, తదితరులు పాల్గొన్నారు.