జగిత్యాల టౌన్, డిసెంబర్ 25: జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ, క్రైస్ట్, ఏసురత్నం చర్చిల్లో పాస్టర్లు జీవరత్నం, జకరియా ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. చిన్నారులకు డ్యాన్స్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. సీఎస్ఐ చర్చిలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
రాయికల్, డిసెంబర్ 25: రాయికల్ పట్టణంతో పాటు గ్రామాల్లోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రజాప్రతినిధులు, నాయకులు కేక్ కట్ చేశారు.
సారంగాపూర్, డిసెంబర్25: సారంగాపూర్, బీర్పూర్ ఎంపీపీలు కోల జమున, మసర్తి రమేశ్, జడ్పీటీసీలు మేడిపెల్లి మనోహర్‌రెడ్డి, పాత పద్మ, వైస్ ఎంపీపీలు సొల్లు సురేందర్, బల్మూరి లక్ష్మణ్‌రావు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.
కొడిమ్యాల, డిసెంబర్ 25: కొడిమ్యాలలోని సీఎస్ఐ చర్చిలో పాస్టర్ రెవరెండ్ ప్రశాంతి కేక్ కట్ చేశారు.
ధర్మపురి, డిసెంబర్ 25: ధర్మపురిలోని పెంతకోస్టు చర్చిలో పాస్టర్ శాంతకుమార్ ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అనంతరం కేక్ కట్ చేశారు. ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వెల్గటూర్, డిసెంబర్ 25: ఎండపల్లి మండలంలోని చెర్లపల్లి బీలీవర్స్ చర్చిలో ఫాదర్ క్యాతం యోనా ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కొత్తపేట, పడకల్ చర్చిల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జీరెడ్డి మహేందర్‌రెడ్డి కేకులు అందజేసి, క్రిస్మస్ విందు ఏర్పాటు చేశారు. పాస్టర్లు, చుంచు రాజేశ్, దావుల బొబెన్ని, అరుణ్, పల్లపు వెంకటస్వామి, కొప్పుల రాజేశ్, జంగిలి రమేశ్, లింగమూర్తి పాల్గొన్నారు.
కోరుట్ల రూరల్, డిసెంబర్ 25: పైడిమడుగు, వెంకట్రావుపేట, మోహన్‌రావుపేట, చిన్నమెట్పల్లి, జోగిన్‌పెల్లి, కల్లూరు చర్చిల్లో పాస్టర్లు ప్రార్థనలు చేశారు.
మెట్పల్లి, డిసెంబర్25: మెట్పల్లిలో ధర్మపురి దేవస్థానం అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ జువ్వాడి కృష్ణారావు బెయేర్షాబా దవాఖాన వైద్య దంపతులకు పుష్పగుచ్ఛం అందజేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మెట్పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కేక్‌ను కట్ చేశారు. క్లబ్ అధ్యక్షుడు దొంతుల ఆంజనేయులు, కోశాధికారి శ్రీధర్, సభ్యులు శ్రీనివాస్‌రావు, అరుణ్దీప్గౌడ్, ఇల్లెందుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
మల్లాపూర్, డిసెంబర్ 25: మండల కేంద్రంలోని కార్మెల్ నిబంధన చర్చితో పాటు, ఆయా గ్రామాల్లోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్ అపోస్తల్, క్రైస్తవులు పాల్గొన్నారు.
కథలాపూర్, డిసెంబర్ 25: మండల కేంద్రంతోపాటు భూషణ్రావుపేట, తాండ్య్రాల చర్చిల్లో ప్రత్యేక పార్థనలు చేశారు. సర్పంచ్ కూన సులోచన, పాస్టర్లు గసికంటి సామ్యేల్, పాలెపు రాజేశ్, గాంధారి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
క్రైస్తవులు పవిత్రంగా జరుపుకొనే కిస్మస్ వేడుకలు జిల్లా వ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంతో పాటు కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో చర్చిలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆయా చర్చిల్లో పాస్టర్లు యేసు జనన వృత్తాంతాన్ని సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా క్రైస్తవులు బైబిల్ గ్రంథాన్ని పఠించారు. పలుచోట్ల కేక్‌లు కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు. ప్రజాప్రతినిధులు, నాయకులు వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.