పెద్దపల్లి రూరల్ : పెద్దపల్లి మండలం రాఘవపూర్‌లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు (Ganesh Utsav) అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు ( MLA Vijaya Ramanarao) హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
గ్రామ మాజీ సర్పంచ్ ఆడెపు వెంకటేశం జన్మదినం ఇదే రోజు కావడంతో వారం రోజులుగా వినాయక మండపం వద్ద అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తుండగా ఎమ్మెల్యే సిహెచ్ విజయ రమణారావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అనంతరం ఆడేపు వెంకటేశం జన్మదిన కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.