వీణవంక, జూన్ 16: మండలంలోని వల్భాపూర్ గ్రామంలో యాదవ కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన మల్లన్న బోనాల్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పాల్గొని మొక్కులు చెల్లించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని మల్లన్న బోనాలు చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో యాదవ కుల పెద్దలు, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.