కార్పొరేషన్, ఫిబ్రవరి 16 : కరీంనగర్లో మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అసెంబ్లీలో కోరారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టును 450 కోట్లతో ప్రారంభించారని గుర్తు చేశారు.
నీటిపారుదల, పర్యాటక శాఖ సమన్వయంతో టెండర్ చేసుకొని 70 శాతం పనులు కూడా పూర్తి చేశామని, మరో 30 శాతం పనులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. అలాగే కులగణన తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కులగణనను పకడ్బందీగా చేపట్టాలని, దీనిపై తీర్మానం కాకుండా చట్టం చేస్తే బాగుంటుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు.