నమ్మి పట్టం కడితే ద్రోహం చేస్తారా?
‘ నా ప్రాణం ఉన్నంత వరకూ బీఆర్ఎస్లోనే కొనసాగుతా. బిల్లులు, డబ్బుల కోసం పార్టీ వీడే నాయకుడిని నేను కాదు. ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసే నాయకుడిని’ అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల స్పష్టం చేశారు.
- నా ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్లోనే..
- కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల
కోరుట్ల, జూన్ 24: ‘ నా ప్రాణం ఉన్నంత వరకూ బీఆర్ఎస్లోనే కొనసాగుతా. బిల్లులు, డబ్బుల కోసం పార్టీ వీడే నాయకుడిని నేను కాదు. ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసే నాయకుడిని’ అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల స్పష్టం చేశారు. ప్రజలు నమ్మి ఎమ్మెల్యేగా పట్టం కడితే ద్రోహం చేస్తారా..? అని డాక్టర్ సంజయ్ కుమార్‌పై మండిపడ్డారు. బీఆర్ఎస్లో ఉన్నత పదవులు అనుభవించిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీని వీడడం బాధ కలిగించిందన్నారు.
పార్టీ మారిన ఇద్దరు వయసులో పెద్దోళ్లు, బుద్దిలో సన్నాసులుగా మారారని ఎద్దేవా చేశారు. కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. సంజయ్ బిల్లులు, డబ్బులకు ఆశపడి దొంగచాటుగా కాం గ్రెస్‌లో చేరారని ఆరోపించారు. సంజయ్‌ని తన గురువుగా భావించానని, ఇప్పుడు ఆయనను చూసి సిగ్గుపడుతున్నట్టు చెప్పారు. బీఆర్ఎస్కు 60 లక్షల సభ్యత్వం కలిగిన కార్యకర్తలు ఉన్నారని, పార్టీని చీల్చే దమ్ము ఎవరికి లేదన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్, మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, నాయకులు దశరథరెడ్డి, ఫహీమ్, జిందం లక్ష్మీనారాయణ, బట్టు సునీల్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

