మెట్పల్లి, డిసెంబర్3: ‘నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించిన కోరుట్ల నియోజకవర్గం ప్రజలకు సేవకుడిలా పనిచేస్తా. ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతా, ప్రజా సంక్షేమం, నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తానని’ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు.
భారీ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గం ప్రజలకు, తన గెలుపు కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.