ఓదెల, ఏప్రిల్ 22 : రైతు సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని, మన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రశంసించారు. సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్ లాంటి పథకాలు అమలు చేస్తూ రైతుపక్షపాతిగా నిలిచారని కొనియాడారు. శనివారం ఆయన ఓదెల, కనగర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అన్నదాతలు కష్టపడి పండించిన పంట ఉత్పత్తులకు మద్దతు ధర ఇచ్చేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు.
రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెంటర్ల నిర్వాహకులు వెంటవెంటనే ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కునారపు రేణుకాదేవి, ప్యాక్స్ చైర్మన్ ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి, ఆర్బీఎస్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కావటి రాజుయాదవ్, ఐరెడ్డి వెంకటరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు ఆళ్ల రాజిరెడ్డి, సర్పంచ్ దామోదర్‌రెడ్డి, నాయకులు ఆకుల మహేందర్, ఆరెల్లి మొండయ్యగౌడ్, కందుల సదాశివ్, గట్టు మహేశ్‌గౌడ్, బోడకుంట చినస్వామి, పోలోజు రమేశ్, ఏపీఎం లతామంగేశ్వరి తదితరులు పాల్గొన్నారు.