ఆడబిడ్డ ఆనందహేల
బతుకమ్మ పండుగకు ఐదేళ్ల నుంచి సారె పెడుతున్న రాష్ట్ర సర్కారు, ముచ్చటగా ఆరోసారి అందిస్తున్నది. కార్మికక్షేత్రం సిరిసిల్లతోపాటు గర్శకుర్తిలో తీరొక్క వర్ణాలు, డిజైన్లలో రూపుదిద్దుకున్న బతుకమ్మ చీరెలను, కులమతాలకతీతంగా 18ఏళ్లు నిండిన మహిళలందరికీ మూడురోజులుగా పంపిణీ చేస్తుండగా, ఊరూరా పండుగలా సాగుతున్నది
- బతుకమ్మ చీరల పంపిణీతో సంబురం
- గొల్లపల్లిలో అందజేసిన మంత్రి కొప్పుల
- ఆయాచోట్ల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు
- నచ్చిన చీరను అందుకొని మురిసిన అతివలు
- సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
కార్పొరేషన్/ రామడుగు/ శంకరప్నటం, సెప్టెంబర్ 24: బతుకమ్మ పండుగకు ఐదేళ్ల నుంచి సారె పెడుతున్న రాష్ట్ర సర్కారు, ముచ్చటగా ఆరోసారి అందిస్తున్నది. కార్మికక్షేత్రం సిరిసిల్లతోపాటు గర్శకుర్తిలో తీరొక్క వర్ణాలు, డిజైన్లలో రూపుదిద్దుకున్న బతుకమ్మ చీరెలను, కులమతాలకతీతంగా 18ఏళ్లు నిండిన మహిళలందరికీ మూడురోజులుగా పంపిణీ చేస్తుండగా, ఊరూరా పండుగలా సాగుతున్నది. శనివారం గొల్లపల్లి మండలం ఇబ్రహీంనగర్‌లో మంత్రి కొప్పుల ఈశ్వర్ చీరలను అందజేశారు.

జగిత్యాల పట్టణంలోని సుభి గార్డెన్స్‌లో పట్టణంలోని 28,29,41,42 వార్డులకు చెందిన ఆడబిడ్డలకు అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. రామడుగు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 33, 11వడివిజన్లలో మేయర్ సునీల్‌రావు అందజేశారు. ఓదెల మండలంలోని 22గ్రామాల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పర్యటించి లబ్ధిదారులకు నేరుగా అందజేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

