వేములవాడ టౌన్, జూన్ 19 : రాజకీయాలకు అతీతంగా రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కేంద్ర మంత్రి గా బాధ్యతలు తీసుకున్నాక బుధవారం రాత్రి మొదటిసారి రాజన్నను దర్శించుకున్న అనంత రం వారు విలేకరులతో మాట్లాడారు. రాజరాజేశ్వర స్వామివారి దర్శనం కోసం వచ్చానన్నారు. ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందని, ఆలయ అభివృద్ధికి కేంద్ర సహకారం ఉంటుందని అన్నారు. వీరి వెంట బీజేపే నాయకులు చెన్నమనేని వికాస్‌రావు, రేగుల మల్లికార్జున్, పట్టణాధ్యక్షుడు రేగుల సంతోశ్ బాబు, ఎర్రం మహేశ్, అల్లాడి రమేశ్, కుమ్మరి శంకర్, గోపు బాలరాజు, బండ మల్లేశంతోపాటు నాయకులు, కార్యకర్తలున్నారు.
అంతకుముందు వేములవాడ వచ్చిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ దర్శించుకున్నారు. ఆలయంలో వారికి అర్చకులు ఘన స్వాగ తం పలికారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మ హాజన్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ వారికి పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఆలయంలో వారు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆశీర్వచ నం చేయగా, వారికి ఆలయ ఈవో రామకృష్ణ వారికి స్వా మివారి ప్రసాదాన్ని అందజేశారు. వారి వెంట ఆలయ ఈవో రామకృష్ణ, ఆర్డీవో రాజేశ్వర్, డీఎస్పీ నాగేంద్రచారి, తహసీల్దార్ మహేశ్‌కుమార్, అధికారులున్నారు .
సిరిసిల్ల టౌన్, జూన్ 19: సిరిసిల్లలోని మార్కండేయ ఆలయంలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బుధవారం ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, పట్టణ పద్మశాలీ సంఘం అధ్యక్షుడు గోలి వెంకటరమణ, పద్మశాలీ అనుబంద సంఘాల నాయకులు, వస్త్ర పరిశ్రమ నాయకులు, తదితరులున్నారు.