Enjoyment survey | రామగిరి జూలై 4: రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ మేడిపల్లి శివారులోని భూములను ఎంజాయ్మెంట్ సర్వే కోసం శుక్రవారం వచ్చిన రెవెన్యూ అధికారులను రత్నాపూర్ గ్రామ ప్రజలు, రైతులు మరోసారి అడ్డుకున్నారు. గత 3 నెలల క్రితం కూడా అడ్డుకున్న విషయం విధితమే. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం మేడిపల్లి శివారులోని భూములను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడానికి నోటీసులు విడుదల చేశారు.
దీని విషయంపై పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఫీల్డ్ మీదికి వచ్చిన రెవెన్యూ అధికారులను గ్రామ రైతులందరూ కలిసి అడ్డుకున్నారు. ఈ సర్వే చేసేందుకు రైతులందరూ నిరాకరించారు ఈ భూములను ఇచ్చే ప్రసక్తే లేదని అధికారులతో తన గోడు వెళ్లబుచ్చుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా మీరు ఎన్ని సార్లు వచ్చిన అడ్డుకుంటామన్నారు.
దీంతో అక్కడికి వచ్చిన సిబ్బంది తమ పై అధికారుల సూచన మేరకు అక్కడి నుంచి వెనుతి రాగరు. అక్కడి రైతులు, గ్రామస్తులు కొండు లక్ష్మణ్, భద్రపు కృష్ణమూర్తి, ఉనగొండ మధుకర్, మండల శంకర్, భరత్, సాల్పలా లక్ష్మణ్, చిదురాల శివ తదితరులు పాల్గొన్నారు.