KTR | శ్రీ వేణుగోపాల స్వామి ఆశీస్సులతో రాజన్నసిరిసిల్ల జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
శ్రీ వేణుగోపాలస్వామి ఆశీస్సులతో జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆకాక్షించారు.
KTR | రాజన్న సిరిసిల్ల, నవంబర్ 22 ( నమస్తే తెలంగాణ) : శ్రీ వేణుగోపాలస్వామి ఆశీస్సులతో జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆకాక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయన ఆదివారం పర్యటించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం అంగరంగవైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి హాజరయ్యారు. కళ్యాణ ఉత్సవంలో పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు తీర్థ ప్రసాదాలు అందించి శాలువాతో సన్మానించి, సత్కరించారు. వేణుగోపాల స్వామి ఆశీస్సులతో జిల్లా ప్రజలు బాగుండాలని ఆకాక్షించారు. అంతకు ముందు కేటీఆర్ కు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. కేటీఆర్ వెంట హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, న్యాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, స్థానిక నేతలు తదితరులు ఉన్నారు.
వివాహ వేడుకల్లో కేటీఆర్..
సిరిసిల్ల 37వ వార్డు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసరి గోపాల్ కూతురు వివాహం సిద్దిపేటలో జరిగింది. కాగా వేడుకల్లో కేటీఆర్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం గంభీరావుపేట మండలం కేంద్రానికి చేరుకున్నారు. నర్మాలకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత యాది లాల్ కొడుకు వివాహ వార్షికోత్సవం హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అదే విధంగా ముస్తఫా నగర్ లో వీరబోయిన రమేశ్ కొడుకు వివాహం జరగగా, వారి నివాసానికి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | లారీని ఢీకొట్టిన టెంపో.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం..!
Army Families Killed | లారీ ఢీకొట్టడంతో రెండు ముక్కలైన కారు.. ఆర్మీ కుటుంబాలకు చెందిన ఏడుగురు మృతి
Srinath Maganti | సుశాంత్ స్థానంలో కార్తీక్‌గా మెప్పించిన శ్రీనాథ్ మాగంటి.. ‘ఈఎన్ఈ రిపీట్’తో అద్భుత విజయం!
Sweet Potato | రూ.20కే లభించే ఈ కూరగాయతో ఎంతో ఆరోగ్యం.. చలికాలంలో తప్పక తినాల్సిందే.. ఎందుకంటే..
Dasoju Shravan Kumar | ఆ రూ.300 కోట్లు గంగలో కలిసినయి.. ఇప్పుడు ఇంటర్ బోర్డు రద్దంటున్నడు : ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

