Masashivratri | కమాన్ చౌరస్తా, ఆగస్టు 22 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని భగత్‌నగర్ హరిహరక్షేత్రంలో మాస శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శివాలయంలో గణపతి, శివలింగానికి ఫల పంచామృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు.. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి, లలితా సహస్రనామ – సహిత రుద్ర హోమం నిర్వహించారు.
సాయంత్రం వేములవాడ వేద పండితులచే సహస్ర లింగార్చన కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ ఆలయ చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్, దేవాలయ కార్య నిర్వహణ అధికారి శ్రీ కాంతారెడ్డి, గురుస్వామి రాచకొండ చక్రధర్ రావు, దేవాలయం ధర్మకర్తల మండలి సభ్యులు సత్యనారాయ, శ్రీనివాస్ కృష్ణ, ఆనంద రెడ్డి, కవిత, అర్చకులు, సిబ్బంది పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.