కాల్వశ్రీరాంపూర్, ఫిబ్రవరి 26: అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసే పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఆశన్నపల్లెకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, వార్డు సభ్యులు తీగల సంపత్, పెండ్లి తిరుపతి, కూస నాగరాజు, మంద రంజిత్, ముస్కు కుమార్, మంద హరీశ్, కంప శంకర్, కదురు రాజయ్య, ఎరుకల సాగర్ ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే దాసరి చేస్తున్న అభివృద్ధిని చూసి తామంతా బీఆర్ఎస్లో చేరుతున్నట్లు వారు పేర్కొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్, సర్పంచ్ మంద రమావెంకన్న, ఎంపీటీసీ పెండ్లి సంపత్, మండల శాఖ అధ్యక్షుడు గొడుగు రాజ్‌కుమార్, పెద్దపల్లి విండో చైర్మన్ మాదిరెడ్డి నర్సింహారెడ్డి, ఆర్బీఎస్ కన్వీనర్ ఎరుకల మల్లయ్య, గ్రామ అధ్యక్షుడు కూస హరీశ్, నాయకులు తీగల నాగరాజు, కదురు రాజిరెడ్డి, కూస శ్రీనివాస్, ఒల్లాల కొమురయ్య, పెండ్లి రాజేందర్, కదురు రాజ్‌కుమార్, కూస రవి తదితరులు పాల్గొన్నారు.