Drainage | చిగురుమామిడి, అక్టోబర్ 11: గ్రామంలో మురుగు నీరు పేరుకుపోయి తీవ్ర దుర్గంధం వస్తున్నప్పటికీ గ్రామపంచాయతీ పట్టించుకోకపోవడం పట్ల మురుగు నీటిలో వ్యక్తి నిరసన వ్యక్తం చేశారు. చిగురుమామిడి మండలంలోని చిన్నముల్కనూర్ గ్రామంలో దుర్గమ్మ తల్లి గుడి ముందు డ్రైనేజీ మురుగు నీరు పేరుకుపోయి వాసన వస్తోంది.
దీంతో గ్రామ పంచాయతీకి పలుమార్లు విన్నవించినప్పటికీ సమస్యను పట్టించుకోకపోవడంతో వంగపల్లి రవి అనే వ్యక్తి మురుగు నీటిలో బొర్లుతూ కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. మురుగు నీరు, వాసనతో అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, అధికారులు త్వరితగతిన స్పందించి మురుగు నీటిని తొలగించాలని కోరారు. నిత్యం గ్రామస్తులకు తీవ్రదుర్గంధం వస్తుందని పేర్కొన్నారు.