B Vinod Kumar | దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలి.. కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో రాజకీయ పోరాటాలు, కేంద్ర ప్రభుత్వ హామీలు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజల త్యాగాలు కీలక పాత్ర పోషించాయని మాజీ ఎంపీ బీ వినోద్ కుమార్ అన్నారు.
B Vinod Kumar | శంకరపట్నం, నవంబర్ 25 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో రాజకీయ పోరాటాలు, కేంద్ర ప్రభుత్వ హామీలు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజల త్యాగాలు కీలక పాత్ర పోషించాయని మాజీ ఎంపీ బీ వినోద్ కుమార్ అన్నారు. ఈ నెల 29న అలుగునూరు చౌరస్తా సమీపంలో నిర్వహించనున్న దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శంకరపట్నంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ఆవిర్భవించిందని, నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లామని తెలిపారు. పలుమార్లు కేసీఆర్ తెలంగాణ రాజీనామాలు చేసి ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపారని గుర్తు చేశారు.
‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరిన కేసీఆర్‌ను అలుగునూరు వద్ద పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారని వినోద్ కుమార్ తెలిపారు. కావున నాటి ఉద్యమ స్మృతులను గుర్తు చేసేందుకు నిర్వహించే దీక్షా దివస్ సభ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణవాదులు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మాజీ సీజేఐ ఎన్వీ రమణ
Septic Tank | బాచుపల్లి ఘటనను సుమోటోగా స్వీకరించిన మానవ హక్కుల కమిషన్
‘ఉప సర్పంచులు, వార్డు సభ్యుల హక్కుల సాధనకు పోరాటం’
‘చరిత్రలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష’
Dalimb Trailer | జీ5లో సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ ‘దాలింబ్’.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

