MLA Gangula Kamalakar | కోతిరాంపూర్‌లో మైసమ్మ తల్లి బోనాలు.. దసరా నాటికి నూతన ఆలయం నిర్మిస్తామని ఎమ్మెల్యే గంగుల హామీ
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతిరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో వెలసిన మైసమ్మ తల్లి బోనాల వేడుకలు మంగళవారం కన్నులపండువగా నిర్వహించారు. సరస్వతి నగర్, గిద్దె పెరుమాండ్ల కాలనీవాసులు, స్థానిక మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
MLA Gangula Kamalakar | కమాన్ చౌరస్తా, ఆగస్టు 11 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతిరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో వెలసిన మైసమ్మ తల్లి బోనాల వేడుకలు మంగళవారం కన్నులపండువగా నిర్వహించారు. సరస్వతి నగర్, గిద్దె పెరుమాండ్ల కాలనీవాసులు, స్థానిక మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బోనాల వేడుకకు హాజరైన ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు స్థానిక కాలనీవాసులు ఘన స్వాగతం పలికారు. మహిళా భక్తులు నుదుటిన తిలకం దిద్ది, మంగళహారతి ఇచ్చి, శాలువాతో సత్కరించారు. అనంతరం గంగుల కమలాకర్ అమ్మవారి బోనం ఎత్తుకుని ఆలయం వరకు నడుచుకుంటూ వెళ్లి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
శివశక్తుల పూనకాలతో బోనాల వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య కోలాహలంగా సాగాయి. ఈ సందర్భంగా అమ్మవారి పూనకం వచ్చిన ఓ మహిళా భక్తురాలు మైసమ్మ తల్లికి శాశ్వత ప్రాతిపదికన ఆలయం నిర్మించాలని ఎమ్మెల్యేను కోరారు. ఎల్లమ్మ తల్లి కలలో కనిపించి తాను స్థానిక పెంటకుప్పలో వెలిశానని తెలిపిందని, దీంతో కాలనీవాసులంతా కలిసి అమ్మవారిని ప్రతిష్టించుకున్నారని నిర్వాహకులు తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన గంగుల కమలాకర్ మాట్లాడుతూ వచ్చే దసరా పండుగ నాటికి ప్రజల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.
బోనాల వేడుకల్లో భాగంగా భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి, యాట పిల్లలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు ఎడ్ల అశోక్, దురిశెట్టి అనూప్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు మిడిదొడ్డి నవీన్, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, జీపీ స్వామి, స్థానిక కాలనీవాసులు ఎల్లయ్య, బాల్ రెడ్డి, శేఖర్, సుధాకర్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు హాజరై అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

