Jagityal | మహిళా శక్తి కార్యక్రమాలు జిల్లా సమాఖ్య ద్వారా విజయవంతం చేయాలి.. జగిత్యాల జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి ఎం రఘువరణ్
సెర్ప్ కి సంబందించి మహిళా శక్తి కార్యక్రమాలు జిల్లా సమాఖ్య విజయవంతం చేయాలనీ, మహిళా సంఘాలకు ఆర్థికంగా చేయూతను ఇచ్చి వారికి జీవనోపాధులు కల్పించాలని జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారి ఎం రఘువరణ్ అన్నారు.
Jagityal | జగిత్యాల, నవంబర్ 3 : సెర్ప్ కి సంబందించి మహిళా శక్తి కార్యక్రమాలు జిల్లా సమాఖ్య విజయవంతం చేయాలనీ, మహిళా సంఘాలకు ఆర్థికంగా చేయూతను ఇచ్చి వారికి జీవనోపాధులు కల్పించాలని జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారి ఎం రఘువరణ్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా సమాఖ్య సమావేశం సమాఖ్య సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు. ఆ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ గత నెలలో దాదాపు అన్ని గ్రామ సంఘాలు, మండల సంఘాలు, జిల్లా సమాఖ్యలో నూతన పాలక వర్గ సభ్యులను ఎన్నుకున్న సందర్భంగా అందరికి అభినందనలు తెలిపారు. ఆయా సమాఖ్య సభ్యులు ప్రతీ సెర్ప్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి జిల్లా ను ముందంజలో ఉంచాలని కోరారు.
జిల్లా అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ పీ సునీత మాట్లాడుతూ జిల్లాలో గ్రామ సంఘ భవనాలు త్వరిత గతిన పూర్తి చేయించాలని, గ్రామ సంఘం అసిస్టెంట్ లకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, సమాఖ్య సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని, మార్కెటింగ్ కార్యక్రమాలు రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలనీ, ఇంకా పలు అంశాలపై మాట్లాడారు. గ్రామీణ నిరుద్యోగ యువతకి, స్వయం సహాయక సంఘాల వారికీ, వారి కుటుంబ సభ్యులకు ఉచిత శిక్షణలు, ఉపాధి అవకాశాలపై పోస్టర్‌ను డీఆర్డీవో ఆవిష్కరించారు. జిల్లా డీపీఎంలు రమేష్, నాగేశ్వర్ రావు, నారాయణ, స్త్రీనిధి ఆర్ఎం రాం నారాయణ, అధికారులు, మహిళా సమాఖ్యాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLC Dasoju Sravan | తెలంగాణలో భయానకమైన పరిస్థితులు ఉన్నాయి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Race Course Land: రేస్ కోర్స్ స్థలాన్ని ఐఏఎఫ్కే ఇవ్వండి.. రాజ్‌నాథ్‌కు లేఖ రాసిన ఏపీ సింగ్
‘పెన్షనర్లు జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి’
High BP | రక్తపోటు ఉన్నవారు మందులను మానేస్తే కలిగే దుష్పరిణామాలు ఇవే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

