ధర్మారం/ రామడుగు/ బోయినపల్లి, ఆగస్టు 3 : ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లింక్-2లో ని నంది, గాయత్రీ పంప్‌హౌస్‌లలో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. గత నెల 27 నుంచి శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నుంచి అండర్ టన్నెళ్ల ద్వారా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంప్‌హౌస్‌కు చేరిన నీటిని ఎత్తిపోస్తుండగా, శనివారం 4మోటర్ల ద్వా రా కొనసాగించారు. 2,3,5,7 మోటర్ల ద్వారా 3,150క్యూసెక్కుల చొప్పున 12, 600 క్యూసెక్కుల నీటిని నంది రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నారు.
ఈ రిజర్వాయర్ 10 గేట్లను ఎత్తడంతో గ్రావిటీ కాల్వ ద్వారా జంట సొరంగాలకు చేరి అక్కడి నుంచి 7,8ప్యాకేజీలలోని కరీంనగర్ జి ల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు తరలిపోతున్నా యి. అక్కడి 1,3,4,5 మోటర్ల ద్వారా క్యూసెక్కుల చొప్పున 12,600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు.
అక్కడి నుంచి అప్రోచ్ కెనాల్ నుంచి వరద కాలువకు, అక్కడి నుంచి శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి తరలిస్తున్నారు. కాగా, ఎస్సారార్ జలాశయంలో శనివారం వరకు 14.062 టీఎంసీల నీటి నిలువ ఉన్నట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. ఎగువ నుంచి 13,795 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు పేర్కొన్నారు.