Veenavanka | వీణవంక, జూలై 24 : వీణవంక మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు కొనసాగిస్తున్న ధర్నాకు మద్దతుగా ఆర్టీసీ బస్‌ను ఆపి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉంటూ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండటానికి ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, కోర్కల్ సహకార సంఘం చైర్మన్ సత్యనారాయణ, సర్పంచులు మ్యాడగోని తిరుపతి, మండల కుమారస్వామి, గజ్జెల మొగిలయ్య, నాయకులు కామిడి శ్రీనివాస్‌రెడ్డి, బొబ్బల సమ్మిరెడ్డి, గెల్లు మల్లయ్య, మహిపాల్‌రెడ్డి, రమేష్, భూమయ్య, ప్రశాంత్, గజ్జెల శ్రీకాంత్, నీల పున్నం, వోరెం మధు, వోరెం క్రాంతి, ప్రకాశ్, జీవరత్నం, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.