Ramagiri | రామగిరి : బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలు రామగిరి బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నాగేపల్లి చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించిన అనంతరం బేగంపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ నిత్యం ప్రజల కోసం పరితపించే కేటీఆర్ ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకుని హైదరాబాద్ లో నిరసన కార్యక్రమం చేపట్టిన ప్రజాబాంధవుడు అని కొనియాడారు.
మాజీ రైతుబంధు అధ్యక్షుడు మేధరవేన కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఐటీ మినిస్టర్ గా విశేష సేవలందించిన కేటీఆర్ అనేక ఐటీ పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగులకు ఉద్యోగం అవకాశాలు కల్పించాడని గుర్తుచేశారు. కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయడం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ మళ్లీ మంత్రిగా నిరుద్యోగులకు అండగా ఉంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కాపురవేన భాస్కర్, గద్దల శంకర్, రాచకొండ లక్ష్మణ్, తుమ్మల అశోక్, వీఐపీ సది, బత్తిని ప్రశాంత్, నాయకులు వేగోలపు శ్రీనివాస్ గౌడ్, గాజుల ప్రసాద్, బుర్ర శంకర్, మేడగొని రాజన్న, రొడ్డ శ్రీనివాస్, ధర్ముల రాజసంపత్, దామెర శ్రీనివాస్, బూరుగు రాజు, గద్దల ఓదెలు, బొంకూరి పోశం, బొంగురాల రవీందర్, బీసగోని శ్రావణ్, కొమురయ్య, ఓదెలు, ఆయిందాల రమేష్, రేండ్ల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.