వర్ధిల్లు.. వందేళ్లు.. హ్యాపీ బర్త్డే రామన్న
అభిమాన నాయకుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరిపారు. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు హంగూ ఆర్భాటలకు పోకుండా.. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. సిరిసిల్లలో బాలింతలకు కేసీఆర్ కిట్లు అందజేశారు.
- ఉమ్మడి జిల్లాలో పండుగలా కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలు
- పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు
- అభిమానుల రక్తదాన శిబిరాలు
- సిరిసిల్లలో బాలింతలకు కేసీఆర్ కిట్లు
- అన్నదానాలు.. దవాఖానల్లో పండ్లు పంపిణీ
- కేకులు కోసి, స్వీట్లు పంచిన బీఆర్ఎస్ శ్రేణులు
అభిమాన నాయకుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరిపారు. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు హంగూ ఆర్భాటలకు పోకుండా.. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. సిరిసిల్లలో బాలింతలకు కేసీఆర్ కిట్లు అందజేశారు. రక్తదాన శిబిరాలు నిర్వహించారు. వాడవాడలా అన్నదానాలు చేసి, దవాఖానల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కేకులు కోసి, స్వీట్లు పంచిపెట్టారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి, కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ‘హ్యాపీ బర్త్డే రామన్న’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆపదలో అభాగ్యులకు అండగా నిలిచే ఆపద్భాందవుడు కేటీఆర్ అని కొనియాడారు. ప్రజలు ఎకడ ఇబ్బందుల్లో ఉన్నా అకడ వాలిపోయి, వారి కష్టాల్లో పాలుపంచు కుంటూ ధైర్యాన్నిచ్చే గొప్ప నాయకుడని ప్రశంసించారు. పుట్టిన రోజు సమాజానికి సేవ చేయాలని పిలుపునివ్వడం ప్రజలపై ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పారు.

కరీంనగర్ కార్పొరేషన్, జూలై 24 : కరీంనగర్లో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో రేకుర్తిలోని బధిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు ఏడాదికి సరిపడా నోటు పుస్తకాలు, పెన్నులు, స్టేషనరీ సామగ్రిని పంపిణీ చేశారు. అలాగే మారెట్ రోడ్డులోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి, కూరగాయల వ్యాపారులు, బాటసారులకు అల్పాహార వితరణ చేపట్టారు. 33వ డివిజన్ కార్పొరేటర్ జమ్ము ఆధ్వర్యంలో డివిజన్లోని అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు పలకలు, బలపాలు, కంపాస్ బాక్సులు మరియు బిసెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. 32వ డివిజన్ హుస్సేనీపురాలో కార్పొరేటర్ షేక్ యూసుఫ్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది పిల్లలకు నోటు పుస్తకాలు, పెన్నులు అందజేశారు.

రామడుగులో బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్రెడ్డి, యువజన విభాగం మాజీ మండలాధ్యక్షుడు ఆరపెల్లి ప్రశాంత్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధి బాధిత చిన్నారుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా, 35 మంది రక్తదానం చేశారు. పార్టీ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులతో కలిసి రక్తదానం చేశారు. చొప్పదండిలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మశ్రీనివాస్రెడ్డి, పట్టణాధ్యక్షుడు బత్తిని సంపత్ ఆధ్వర్యంలో పీహెచ్సీలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి పంపిన నోటు పుస్తకాలను ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు అందజేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

