Korutla Town | కోరుట్ల, ఏప్రిల్ 19: పట్టణంలోని కోరుట్ల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ట్రస్మా నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా కేరళ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరస్పాండెంట్ అబ్దుల్ బారీ, ప్రధాన కార్యదర్శిగా కోరుట్ల పబ్లిక్ స్కూల్ కరస్పాండెట్ గుజ్జెటి వెంకటేష్, కోశాధికారిగా ప్రగతి హైస్కూల్ కరస్పాండెంట్ తంగళ్లపల్లి దీపక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని జిల్లా ట్రస్మా ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ట్రస్మా గౌరవాధ్యక్షుడు రవి ప్రసాద్, అధ్యక్షుడు శ్రీధర్ రావు, పట్టణ ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్స్ సత్యనారాయణ, మహాదేవ్, రమేష్, రాజేంద్రప్రసాద్, కిజర్, దామోదర్, మహాదేవ్, దామోదర్, శ్రీధర్, మోయిస్ తదితరులు పాల్గొన్నారు.