కాంగ్రెస్ ద్రోహానికి వ్యతిరేకంగానే దీక్ష.. యావత్ తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్
కాంగ్రెస్ చేసిన ద్రోహానికి వ్యతిరేకంగానే కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగారని, తెలంగాణ ఉద్యమ చరిత్ర భావితరాలకు అందిద్దామని మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. ఆంధ్రా పాలకుల దోపిడీతో దగా పడ్డ తెలంగాణను విముక్తి చేయాలన్న సంకల్పంతో రాజకీయ ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి అనే రాజకీయ పార్టీని కేసీఆర్ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.
- ఉద్యమ చరిత్రను భావితరాలకు అందిద్దాం
- మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్
- సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో దీక్షా దివస్
రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ/ సిరిసిల్ల టౌన్, నవంబర్ 29 : కాంగ్రెస్ చేసిన ద్రోహానికి వ్యతిరేకంగానే కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగారని, తెలంగాణ ఉద్యమ చరిత్ర భావితరాలకు అందిద్దామని మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. ఆంధ్రా పాలకుల దోపిడీతో దగా పడ్డ తెలంగాణను విముక్తి చేయాలన్న సంకల్పంతో రాజకీయ ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి అనే రాజకీయ పార్టీని కేసీఆర్ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష 16 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన దీక్షా దివస్ విజయవంతమైంది. జిల్లా నలుమూలల నుంచి గులాబీ సైనికులు దండుగా కదలివచ్చి భాగస్వాములయ్యారు. మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ముఖ్యఅతిథులుగా హాజరై, నాయకులతో కలిసి ఉద్యమకాలం నాటి ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించి, జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అక్కడే ఉన్న గులాబీ రంగు అంబాసిడర్ కారులో వారిద్దరూ ఎక్కి అభివాదం చేస్తూ ఉత్సాహంగా గడిపారు.
సభా వేదికపై ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి, అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీలు అడ్డుపడినందునే తెలంగాణ ఇవ్వలేదన్న మాటల్లో వాస్తవంలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అప్పుడు తీసుకున్న నిర్ణయంతో ఎంతోమంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని, 1300 మంది ఆత్మ బలిదానాలపై రేవంత్‌రెడ్డి సోనియాగాంధీని బలిదేవత అన్నారని గుర్తుచేశారు. ఉద్యమ చరిత్రలోని ఘట్టాలను భావితరాలకు అందించేందుకు దీక్షా దివస్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మాజీ వైస్ చైర్మన్ సిద్దం వేణు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఆకునూరి శంకర య్య, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్లు జిందం కళ, రామతీర్థపు మాధవి, బొల్లి రామ్మోహన్, ఏనుగు మనోహర్‌రెడ్డి, కుంబాల మల్లారెడ్డి పాల్గొన్నారు.
విముక్తి కోసం పోరాడిన చరిత్ర బీఆర్ఎస్దే
ఈ భూమి విముక్తి కోసం పోరాడిన చరిత్ర బీఆర్ఎస్కు మాత్రమే దక్కుతుంది. బషీర్‌బాగ్‌లో రైతులను తుపాకులతో కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబుది. ఆనాడే కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి ప్రజల కోసం ముందుకు వచ్చిండు. కేసీఆర్ ఆకల్ని చంపుకొన్నాడు కానీ, ఏనాడూ తన ఆత్మగౌరవాన్ని అమ్ముకోలేదు. గులాబీ కండువా వేసుకున్నోళ్లంతా అదృష్టవంతులని భావిస్తున్న. గోసి, గొంగడేసి తెలంగాణ పోరాటంలో భాగస్వామైన నాకు పట్టాభిషేకం చేసింది తెలంగాణ అని గర్వంగా చెప్పుకొంటున్న. ఉద్యమ నాయకులపై తుపాకీ ఎక్కుపెట్టినోడు రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వ రెండేండ్ల పాలనలో ప్రజలు మోసపోయి గోసపడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ అందించిన పాలననే గుర్తు చేసుకుంటున్నారు. మరోసారి మనమే గెలుస్తం.
– మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
దీక్షా దివస్ స్ఫూర్తిగా పోరాడుదాం
తెలంగాణ సాధాన పోరాట స్ఫూర్తిని మనమంతా పునికిపుచ్చుకోవాలి. రాష్ర్టాన్ని సాధించేదాకా ఉద్యమాన్ని భుజానికెత్తుకున్న మహానేత కేసీఆర్ వెంట నిలిచినం. సాధించుకున్న రాష్ర్టాన్ని పదేం డ్ల కాలంలో ఎంతగానో అభివృద్ధి చేసుకున్నం. కేటీఆర్ నాయకత్వంలో జిల్లాలో జరిగిన అభివృద్ధి మన కండ్ల ముందే కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎక్కడి అభివృద్ధి అక్కడే నిలిచిపోయింది. రేవంత్ మాటలు నమ్మిన ప్రజలు నేడు గోసపడుతున్న పరిస్థితులను చూస్తున్నం. ఆరు గ్యారెంటీలు, హామీల అమలు చేసేదాకా ప్రజలను కలుపుకుని నాటి కేసీఆర్ దీక్షా దివస్‌ను స్ఫూర్తిగా తీసుకుని పోరాడుదాం. రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేసేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు సైనికుడిలాగా పని చేయాలి.
– బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

