Attack | కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఖాన్ పురాలో ఓ ఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శించాడు. సెలూన్ నిర్వాహకుడిపై దాడికి ఎస్ఐ పాల్పడ్డాడు. ఇంతకీ కారణమేంటనుకుంటున్నారా..? సదరు సెలూన్ వ్యక్తి ఎస్ఐని అన్నా అని పిలవడమే ఈ దాడికి కారణం కావడం గమనార్హం.
కరీంనగర్ త్రీటౌన్ ఎస్ఐ చందర్ ఖాన్పురాలో ఉన్న ఓ సెలూన్‌కు వెళ్లాడు. సెలూన్ నిర్వాహకుడు రాముడు ఎస్ఐ చందర్‌తో మాట్లాడుతున్న క్రమంలో అన్నా అని పిలిచాడు. తనను అన్నా అని పిలిచినందుకు ఎస్ఐ చందర్ రాములును విచక్షణా రహితంగా కొట్టాడు. ఆగ్రహంతో బూతులు తిడుతూ రాములుపై ఊగిపోయాడు . ఎస్ఐ చందర్ రాములుపై దాడి ఘటనకు సంబంధించిన దృశ్యాలు సెలూన్లో ఉన్న సీసీ పుటేజ్‌లో రికార్డయ్యాయి.
సీసీ ఫుటేజ్.. అన్నా అన్నందుకు సెలూన్ వ్యక్తిపై ఎస్ఐ దాడి
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఖాన్ పురాలో ఎస్ఐ దాష్టీకం
స్థానిక సెలూన్‌కు వెళ్లిన త్రీటౌన్ ఎస్ఐ చందర్, తనను అన్నా అని పిలిచినందుకు రాములు అనే వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి
ఆగ్రహంతో బూతులు తిడుతూ సదరు వ్యక్తిని చితకబాదిన… pic.twitter.com/6ZFQ1ZVTtV
— Telugu Scribe (@TeluguScribe) April 25, 2026
Scientists Mysterious Deaths | చైనాలో శాస్త్రవేత్తలు మృతి, అమెరికాలో అదృశ్యం.. అసలేం జరుగుతోంది?
Pappu Yadav | 70-80 శాతం రాజకీయ నేతలు పోర్న్ చూస్తారు: పప్పు యాదవ్
Arrest | కిడ్నాప్, హత్య కేసులో బెయిల్.. ఆపై పరార్.. 31 ఏళ్ల నాటి కేసులో పట్టుబడ్డ నేరగాడు..!