శంకరపట్నం, జూన్ 12: దళితుల అభ్యున్నతే లక్ష్యంగా దళితబంధు కు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ దళితోద్ధ్దారకుడని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. శంకరపట్నం మండలంలోని ఇప్పలపల్లెకు చెందిన 10 మంది లబ్ధిదారులకు యూ నిట్లు మంజూరుకాగా, జడ్పీచైర్ పర్సన్ కనుమల్ల విజయతో కలిసి కామెర లక్ష్మికి చెందిన క్లాత్ స్టోర్, కామెర గణపతికి చెందిన ఆన్లైన్ సర్వీసెస్, జిరాక్స్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఇద్దరికి ట్రాక్టర్లు, మరొకరికి కారు తాళం చెవులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కార్యదీక్షతో దళితులకు మేలు చేస్తున్నారని కొనియాడారు. సమైక్య పాలకులు కార్పొరేషన్ల ద్వారా రూ. 50 వేల రుణమిచ్చేందుకే కొర్రీలు పెట్టారని.. నేడు రూ. 10 లక్షల రుణాన్ని ఎలాంటి గ్యారెంటీ, స్థి రాస్తులు లేకున్నా ఇవ్వడం సీఎం చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఈ రోజు డ్రైవర్లు కారు, ట్రాక్టర్ల ఓనర్లు కావడం, కూలీలు షాపులు పెట్టడం గొప్ప విషయమన్నారు. ఇప్పలపల్లె దళిత కు టుంబాల కండ్లల్లో కనిపించిన ఆనందం నిజమైన మార్పునకు ప్రతీక అన్నారు.
ఓపెన్ జిమ్ ఏర్పాటుకు కృషి
శంకరపట్నంలోని క్రీడా ప్రాంగణంలో త్వరలో ఓపెన్ జిమ్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రసమయి హామీ ఇచ్చారు. ఆదివారం తాడికల్, కేశవపట్నం గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించారు. కొద్ది సేపు వాలీబాల్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ అన్ని హంగులతో క్రీడా ప్రాంగణాలను తీర్చి దిద్దుతా మని స్పష్టం చేశారు. మొలంగూర్‌లో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను ప్రారంభించారు. సు డా చైర్మన్ జీవీ రామకృష్ణారావు. ఎంపీపీ సరోజన, జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రమేశ్, ఎంఎస్‌వో అంజనీ, ఎంపీడీఓ జ యశ్రీ, డీటీ నాగార్జున, సర్పంచులు బైరి సం పత్, బండారి స్వప్న, కీసర సుజాత, మోరె అ నూష, ఎంపీటీసీలు వరలక్ష్మి, కవిత, తిరుపతి, మొయిన్, వీరస్వామి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్ ఉన్నారు.
కూలి చేసుకునేటోళ్లకు షాపు పెట్టించ్చిండు..
మేము కూలి చేసుకునేటోళ్లం. పెద్ద బిడ్డ పెండ్లి చేయడానికి కిందమీదా పడ్డం. చిన్న బిడ్డ పన్నెండోది సదువుతున్నది. మా అసొంటోళ్లకు దళితబంధు సీఎం కేసీఆర్ ఇచ్చిన వరం. సర్కారు ఇచ్చిన రూ. 10లక్షలతోటి మేము కేశపట్నంల బట్టల షాపు పెట్టినం. ఇయ్యాల ఎమ్మెల్యే రసమయి సారు ఓపెన్ చేసిండు. బాగా ఎదగాలని దీవించిండు. చాలా సంతో షంగా ఉంది. దళితులకు ఎవ్వలు చేయని మేలు కేసీఆర్ సారు చేస్తండు.
– కామెర లక్ష్మి దళితబంధు లబ్ధిదారు (ఇప్పలపల్లె)