తిమ్మాపూర్ రూరల్, నవంబర్ 14: మండలంలోని నుస్తులాపూర్ గ్రామంలోగల సహకార సంఘం ఆవరణలో ఆదివారం సహకార వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సొసైటీ చైర్మన్ అలువాల కోటి సహకార జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వం సొసైటీల ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను వివరించారు. సభ్యులు స్వల్ప, దీర్ఘకాలిక రుణాలను తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఈవో ఆంజనేయులు, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
రైతుల కోసం నిరంతరం కృషి చేస్తామని సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. అఖిల భారత సహకార వారోత్సవాల్లో భాగంగా సంఘం కార్యాలయం ఆవరణలో డైరెక్టర్‌తో కలిసి సహకార జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా చైర్మన్ రమణారెడ్డి మాట్లాడుతూ.. రైతులకు వంటలకు సంబంధం లేకుండా పంట రుణాలు అందిస్తున్నామని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేపట్టామని పేర్కొన్నారు. కార్యక్రమంలో విండో వైస్ చైర్మన్ కరివేద మహేందర్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులు చిట్టిమల్ల శ్రీనివాస్, అందె స్వామి, పోతరవేణి శ్రీనివాస్, ముద్రకోల రాజయ్య, పేర్యాల లక్ష్మి, సీఈవో నర్సయ్య, సిబ్బంది పాల్గొన్నారు.