విద్యానగర్, నవంబర్ 14: అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో వైద్య సేవలందిస్తూ ఉత్తర తెలంగాణకే తలమానికంగా నిలుస్తున్న కరీంనగర్‌లోని రెనె హాస్పిటల్లో ఉచిత కీలుమార్పిడి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తనతల్లి లక్ష్మి స్మారకార్థం హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ బంగారి స్వామి ఆదివారం శిబిరాన్ని ప్రారంభించారు. తొలిరోజు శ్రీలక్ష్మీమహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 మందికి కీలుమార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఆవునూరి రాజవ్వ (ఐలాపూర్, జగిత్యాల), ఎం సరోజన (హుస్నాబాద్, సిద్దిపేట), ఆరరె గంగు (మెట్పల్ల్లి, జగిత్యాల), చింతపండు లక్ష్మి (యైటింక్లయిన్‌కాలనీ, రామగుండం), ఎస్ పోచమ్మ (పోత్కపల్లి, పెద్దపల్లి), ఎం రమ (మల్లాపూర్, తిమ్మాపూర్), ఎస్ భారతి (కునారం పెద్దపల్లి), శంకర్ అక్కపాక( గోదావరిఖని), దర్శింగ్ లకావత్ (రంగంపేట, సిరిసిల్ల), కే దశరథం (కేశనపల్లి, పెద్దపల్లి)కి కీలుమార్పిడి చికిత్స చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్స్ చైర్మన్ బంగారి స్వామి మాట్లాడుతూ పేదలు ఒక్కొక్కరికీ నాణ్యమైన ఇంప్లాంట్స్‌తో రూ. 1.50 లక్షల విలువైన కీలుమార్పిడి ఆపరేషన్ చేయడం ఆనందంగా ఉన్నదన్నారు. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇక్కడ వైస్ చైర్మన్ డాక్టర్ వీకేజీ రాజశేఖర్, ఎండీ డాక్టర్ రజినీ ప్రియదర్శిని, అర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సుధీర్ ద్వారక్నాయుడు, డాక్టర్ చకిలం వేణుగోపాల్, అనస్థీషియా, క్రిటికల్ కేర్ హెచ్‌వోడీ డాక్టర్ మునీశ్బాబు, డాక్టర్ దామోదర్, డాక్టర్ కృష్ణారెడ్డి ఉన్నారు.