హుజూరాబాద్ టౌన్, జూన్ 3: హుజూరాబాద్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో మంత్రి హరీశ్‌రావు జన్మదిన వేడుకలను శుక్రవారం టీఆర్ఎస్ పట్టణశాఖ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ హాజరై కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్మన్ కొలిపాక శ్రీనివాస్, టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు, కౌన్సిలర్ కల్లెపల్లి రమాదేవి, కౌన్సిలర్లు తాళ్లపెల్లి శ్రీనివాస్‌గౌడ్, కేసిరెడ్డి లావణ్య, గనిశెట్టి ఉమామహేశ్వర్, హనుమాన్ దేవాలయం చైర్మన్ బూసారపు బాపూరావు, సీనియర్ నాయకులు పోరెడ్డి శంతన్‌రెడ్డి, ఎండీ ఇమ్రాన్, దండ విక్రంరెడ్డి, మొలుగు పూర్ణచందర్, ప్రతాప కృష్ణ, సంపంగి రాజేందర్, కొండ్ర నరేశ్, రాపర్తి శివ, టేకుల శ్రావణ్, మోరె మధు, ఎం శ్రీనివాస్, పంజాల మురళి, పోరెడ్డి మధుకర్‌రెడ్డి పాల్గొన్నారు. 23వ వార్డు బుడగ జంగాల కాలనీలో కౌన్సిలర్ మొలుగు సృజన-పూర్ణచందర్ ఆధ్వర్యంలో మంత్రి తన్నీరు హరీశ్‌రావు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి , స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
జమ్మికుంటలో..
జమ్మికుంట, జూన్ 3: రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పుట్టిన రోజు వేడుకలు జమ్మికుంట పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ కేక్ కట్ చేశారు. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ టంగుటూరి రాజ్‌కుమార్, నాయకులు దేశిని కోటి, లింగారావు, నరేశ్, శ్రీహరి, రాజు, నరేశ్, ప్రవీణ్, అరుణ్, రోహిత్, ఇమ్రాన్, రాహుల్ ఉన్నారు.
వీణవంకలో..
మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో రాష్ట్ర ఆర్థిక, వైద్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు జన్మదిన వేడుకలు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌కట్ చేసి, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాదవరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్‌రెడ్డి, ఉపసర్పంచ్ భానుచందర్, నాయకులు మహిపాల్‌రెడ్డి, చరణ్, హరీశ్వర్మ, వెంకటేశ్, మధుసూదన్‌రెడ్డి, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.