రామడుగు, మే 31: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఎంపీపీ కలిగేటి కవిత పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ అధ్యక్షతన మంగళవారం సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ ప్రత్యేకాధికారులతో పల్లెప్రగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, పల్లెలు ప్రగతిని సాధించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. పల్లె ప్రకృతి వనాలతో గ్రామాలకు కొత్త శోభ వచ్చిందని పేర్కొన్నారు. ఏపీవో రాధ ఎనిమిదో విడుత హరితహారం పురస్కరించుకొని గ్రామ గ్రీన్ యాక్షన్ ప్రణాళికలో మొక్కలు నాటేందుకు స్థలాల ఎంపిక, తదితర అంశాలను చదివి వినిపించారు. ఇప్పటికే మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు 23 మంది ఆయా శాఖలకు చెందిన అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారు.సమావేశంలో ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, పంచాయతీ రాజ్ డీఈ లచ్చయ్య, నాయబ్ తహసీల్దార్ ఖాజా కుతుబొద్దీన్, ఏపీవో రాధ, పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, మే 31: మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల ప్రత్యేకాధికారి సంపత్ కోరారు. కొత్తపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ పిల్లి శ్రీలత-మహేశ్‌గౌడ్ అధ్యక్షతన మంగళవారం ప్రల్లె ప్రగతి కార్యక్రమంపై మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూన్ 3 నుంచి 18వ తేదీ వరకు మండలంలో పల్లె ప్రగతి కార్యక్రమం కొనసాగుతుందన్నారు. గ్రామసభల నిర్వహణ, పారిశుధ్య పనులు, గ్రామాల్లో పాదయాత్ర, గతంలోని ప్రల్లె ప్రగతి నివేదికలను గ్రామ సభల్లో చదివి వినిపించడం, శిథిల భవనాల తొలగింపు, గ్రామ పంచాయతీల ఆదాయ వ్యయాలు, రోడ్లు, మురుగు కాలువల శుభ్రం, తాగునీటి వనరుల నిర్వహణ, ప్రభుత్వ కార్యాలయాల్లో శ్రమదానం తదితర కార్యక్రమాలను రోజు వారీగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. సమావేశంలో మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఆయా గ్రామ పంచాయతీల ప్రత్యేకాధికారులు, ప్రంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్ మండలంలో
రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమంతో పట్టణాలకు దీటుగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నదని ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య పేర్కొన్నారు. కరీంనగర్ రూరల్ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ అధ్యక్షతన ఐదో విడుత పల్లె ప్రగతిపై సమావేశం నిర్వహించారు. గ్రామ ప్రత్యేకాధికారులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులకు పల్లె ప్రగతి పనుల పై ప్రత్యేక కార్యాచరణ ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీవో సంపత్‌కుమార్, ఎంపీవో జగన్మోహన్రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయాధికారి సత్యం, ప్రత్యేకాధికారులు, ఏఈవోలు, ఐకేపీ, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.