కమాన్‌చౌరస్తా, మే 30: నగరంలోని పారమిత పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి బోధనా అభ్యాసన ప్రణాళికల కసరత్తుపై సోమవారం విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఈ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్‌రావు మాట్లాడుతూ, విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచడానికి పాఠ్యప్రణాళికల రూపకల్పన ఎలా ఉండాలో వివరించారు. అనంతరం పారమిత విద్యా సంస్థల్లో సృజనాత్మకమైన పరిశోధనాత్మక ప్రాజెక్ట్‌లు రూపొందించడంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన లలిత మోహన్ సాహుకు ఢిల్లీకి చెందిన రిఫాసిమెంటో ఇంటర్నేషనల్ సంస్థ గ్లోబల్ అచీవ్ మెంట్ అవార్డు ప్రదానం చేశారు.
కాగా, సాహుకు ప్రసాద్‌రావు అవార్డుతో పాటు రూ. 50 వేల నగదు అందజేసి, సత్కరించారు. అలాగే, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సౌట్స్ బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేయగా, వారికి ప్రసాద్ రావుతో నాటె సౌట్స్, గైడ్స్ జిల్లా సెక్రటరీ కంకణాల రాంరెడ్డి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో పారమిత విద్యాసంస్థల డైరెక్టర్లు ప్రసూన, రశ్మిత, రాకేశ్, అనూకర్ రావు, వీయూఎం ప్రసాద్, వినోద రావు, హన్మంత్ రావు, ప్రిన్సిపాళ్లు, కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు.