తిమ్మాపూర్ రూరల్, మే 26: దళితుల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పథకాలు ప్రవేశపెడుతున్నారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మానకొండూర్ మండలం బంజేరుపల్లి గ్రామానికి చెందిన 22 మంది దళితబంధు లబ్ధిదారుల కు గురువారం ఆయన ట్రాక్టర్లు, కార్లు, ఆటోలు, గూడ్స్ వాహనాలు, పేపర్ ప్లేట్ల తయారీ యంత్రాలను అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ, దళితులు ఆర్థికాభివృద్ధి సాధించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని, యూనిట్లను సద్వినియో గం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని లబ్ధిదారులకు పిలుపునిచ్చారు. ఇక్కడ జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్‌గౌడ్, సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్, ఉపసర్పంచ్ నెల్లి మురళి, నాయకులు ఉన్నారు.