వీణవంక, మే 7: సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం రైతు కుటుంబాలకు గొప్ప భరోసా కల్పిస్తున్నదని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వాల బాలకిషన్‌రావు పేర్కొన్నారు. మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన రైతు పండ్రాల సమ్మయ్య ఇటీవల మృతిచెందగా, శనివారం బాధిత కుటుంబ సభ్యులను ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, స్థానిక నాయకులతో కలిసి పరామర్శించారు. రూ.5 లక్షల రైతుబీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ బాలకిషన్‌రావు మాట్లాడుతూ, దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దని కొనియాడారు. ఏ కారణంతో రైతు మరణించినా అతడి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సాయం అందిస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు. యాసంగిలో వరిధాన్యాన్ని కొనకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న కేంద్రంలోని బీజేపీకి రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు చెనవేణ కుమార్‌యాదవ్, సర్పంచ్ పొదిల జ్యోతి-రమేశ్, ఎంపీటీసీ ఎలవేన సవిత-మల్లయ్య, ఉపసర్పంచ్ రామిడి సంపత్‌రెడ్డి, మాజీ సర్పంచ్ జక్కు నారాయణ, మాజీ ఎంపీటీసీ బొంగోని గోపాల్‌గౌడ్, ఏవో గణేశ్, ఏఈవో శ్రీకాంత్, వార్డు సభ్యులు బొంగోని సదానందం గౌడ్, దండి తిరుపతి, గర్వందుల కిరణ్‌గౌడ్, నాయకులు బొంగోని రాజయ్యగౌడ్, బైరెడ్డి భాస్కర్‌రెడ్డి, దూడం సదానందం తదితరులు పాల్గొన్నారు.