ఓదెల, మే 6: కేడీసీసీబీకి దేశవ్యాప్త గుర్తింపు వచ్చిందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పేర్కొన్నారు. పొత్కపల్లిలో రూ.63 లక్షల నాబార్డ్ నిధులతో చేపట్టిన సహకార సంఘ భవనం, గోదాం నిర్మాణ పనులకు శుక్రవారం వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దేశంలోనే చొప్పదండి సహకార సంఘం మొదటిస్థానంలో నిలువడం గర్వకారణమన్నారు. రూ.70కోట్ల లోటులో ఉన్న కేడీసీసీబీని లాభాల బాటలోకి తీసుకురావడంతో రూ.2,500 కోట్ల డిపాజిట్లు జరిగినట్లు వివరించారు. పొత్కపల్లిలోని సంఘాన్ని 2005లో ఎత్తివేయడానికి నిర్ణయం తీసుకున్నామని, పాలకవర్గం వినతి మేరకు కొనసాగిస్తే ఇప్పుడు జిల్లాలోనే మంచిస్థానంలో నిలిచిందని చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సీఈవో అంజిరెడ్డిని అభినందించారు. సహకార సంఘాల రైతులు తమ ప్రయోజనాల కోసం వివిధ వ్యాపారాలు నిర్వహించి లాభాలు పొందవచ్చని చెప్పారు.
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి అడుగు పెడితే లాభాలతోపాటు ప్రజలకు మంచి ఉత్పత్తులను అందించ్చవచ్చని తెలిపారు. ఈ సంవత్సరం రైతులకు పంట రుణాలివ్వడానికి ఒక్కో సంఘానికి రూ.1.50 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. రైతుల పిల్లలు విదేశాల్లో చదువుకునేందుకు తమ బ్యాంక్ తోడ్పాటునందిస్తుందని పేర్కొన్నారు. లాభాల కోసమే కాకుండా సేవా దృక్పథంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షే మం కోసం దేశంలో ఎక్కడా లేని పథకాలు అమ లు చేస్తున్నారని తెలిపారు. సహకార సంఘాల పాలనలో పారదర్శకత ఉండాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే, నాఫ్స్కాబ్ చైర్మన్‌ను సన్మానించారు.
కార్యక్రమంలో విండోచైర్మన్ ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ మద్దెల కమల, సర్పంచ్ ఆళ్ల రాజిరెడ్డి, ఉపసర్పంచ్ వంగ శ్రీనివాస్, సీఈవో గోలి అంజిరెడ్డి, ఎంపీపీ కునారపు రేణుకాదేవి, జడ్పీటీసీలు గంట రాములు, వంగల తిరుపతిరెడ్డి, జిల్లా సహకార అధికారి మైకేల్ బోస్, కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణరావు, ఏవో నాగార్జున, టీఆర్ఎస్, ఆర్బీఎస్ మండలాధ్యక్షులు ఐరెడ్డి వెంకటరెడ్డి, కావటి రాజుయాదవ్, నాయకులు ఆకుల మహేందర్, గోపు నారాయణరెడ్డి, రెడ్డి శ్రీనివాస్, జీల తిరుపతి, ఆరెల్లి మొండయ్యగౌడ్, బోయిని తిరుపతి, కనికిరెడ్డి సతీశ్, వినకొండ అశోక్, డాక్టర్ రాజయ్య, మ్యాడగోని శ్రీ కాంత్, సర్పంచులు,ఎంపీటీసీలు ఉన్నారు.