సిరిసిల్ల టౌన్, మే 5: ‘కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కనబడుట లేదు..గెలిచి మూడేండ్లు దాటుతున్నా నియోజకవర్గానికి చేసిందేంలేదు.. ఇక్కడి ప్రజలను గాలికివదిలి సంగ్రామ యాత్రం టూ తిరుగుతుండు’ అంటూ రాజన్నసిరిసిల్ల జిల్లాకేంద్రంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేసి టీఆర్ఎస్వై నాయకులు వినూత్న నిరసన తెలిపారు. గురువారం అంబేద్కర్ చౌరస్తా వద్ద బైఠాయించి సంజయ్‌కు వ్యతిరేకంగా నినదించారు. ఆయన కనిపిస్తే పట్టుకొచ్చి నియోజకవర్గంలో తిప్పాలని ప్రజలను కోరారు. టీఆర్ఎస్వై పట్టణాధ్యక్షుడు సుంకపాక మనోజ్‌కుమార్ విమర్శించారు. కేసీఆర్ నేతృత్వంలోనే రాష్ట్రం అన్నిరంగాల్లో ముందంజలో ఉన్నదన్నారు. కార్యక్ర మంలో మునీర్, కత్తెర వరుణ్, పంగ మధు, షాదాబ్, కిరణ్, సురేశ్, సాయి, రాంబాబు, మని, అజయ్, అఖిల్, ఫిరోజ్, అజ్జు, గోపీనాయక్, చోటు, మన్సూర్, చిప్ప శ్రీనివాస్, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.