అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్లాల్
కమాన్చౌరస్తా, మే 5 : పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్లాల్ పేర్కొన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం పరీక్షల నిర్వహణపై డీఈ వో సీహెచ్ వీఎస్ జనార్దన్ రావు ఆధ్వర్యంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, కస్టోడియన్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. పదో తరగతి పరీక్షలు జాగ్రత్తగా నిర్వహించాల్సిన బాధ్యత శిక్షకులకు ఉందని సూచించారు. పరీక్ష గదిలో నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ఈ సంవత్సరం ఏడు పేపర్లు ఆరు రోజులల్లో నిర్వహిస్తారని తెలిపారు.
పరీక్ష హాల్లో ఏ చిన్న ఇబ్బంది కలిగిన చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్ మెంట్ ఆఫీసర్లపైనే బాధ్యత ఉంటుందని అన్నారు. కొవిడ్ నిబంధనలు అందరూ పాటించే విధంగా చూడాలని, పరీక్షలకు సమయ పాలన పాటించాలని తెలిపారు. వోఎంఆర్ షీట్లను జాగ్రత్తగా వి ద్యార్థులకు అందించాలని సూచించారు. మారిన నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ బీ.వాసవి, డీసీఈబీ కార్యదర్శి స్వదేశ్ కుమార్, సెక్టోరల్ అధికారులు శ్రీనివాస్, ఆంజనేయులు, మండల విద్యాధికారు లు, సైన్స్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్ మెంట్ అధికారులు పాల్గొన్నారు.