రామడుగు, మే 5: తెలంగాణ సర్కారు ఒంటరి మహిళలకు అండగా ఉంటున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండల కేంద్రానికి చెందిన దివ్యాంగురాలైన ఒంటరి మహిళ జిట్టవేణి శిరీషకు జిల్లా దివ్యాంగుల శాఖ ద్వారా రూ. 50 వేల రుణం మంజూరైంది. కాగా, గురువారం లబ్ధిదారు ఇంటికి ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. దివ్యాంగ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రుణాలను అందిస్తున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, మాజీ సర్పంచ్ పంజాల జగన్మోహన్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు కలిగేటి లక్ష్మణ్, మామిడి నర్సయ్య, రమేశ్, మొయిజ్ఖాన్, సురేశ్, సోహైల్ పాల్గొన్నారు.
నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్
చొప్పదండి, మే 5: సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని రాగంపేటకు చెందిన బత్తిని బుచ్చయ్యకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 2 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. ఎమ్మెల్యే గురువారం లబ్ధిదారు ఇంటికి వెళ్లి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా వచ్చిన ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంపీపీ చిలుక రవీందర్, సింగిల్‌విండో చైర్మన్లు వెల్మ మల్లారెడ్డి, మినుపాల తిరుపతిరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, సర్పంచులు మామిడి లత-రాజేశం, గుంట రవి, సురేశ్, వెల్మ నాగిరెడ్డి, శంకర్, ఎంపీటీసీ సింగిరెడ్డి కిష్టారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వల్లాల కృష్ణహరి, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, కో-ఆప్షన్ సభ్యుడు పాషా, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు మచ్చ రమేశ్, మండల కన్వీనర్ గుడిపాటి వెంకటరమణారెడ్డి, నాయకులు మాచర్ల వినయ్‌కుమార్, నలుమాచు రామకృష్ణ, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, ఎడవెల్లి జనార్దన్, కుందేళ్ల బాలకిషన్, కళ్లెం రవీందర్‌రెడ్డి, కళ్లెం లచ్చిరెడ్డి, మావురం మహేశ్, మారం యువరాజు, రవితేజ, చోటు, పబ్బ శ్రీను, రాజయ్య, బీసవేని రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.