చొప్పదండి,మే 5: సర్కారు అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి చెక్కు లబ్ధిదారుల ఇంటికొచ్చింది. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గురువారం చొప్పదండి మండలంలోని రాగంపేటలో పర్యటించారు. గ్రామానికి చెందిన 17 మంది లబ్ధిదారులకు చెక్కులతో పాటు చీరెలను అందజేశారు. ఊరికి వచ్చిన ఎమ్మెల్యేకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. మహిళలు బొట్టుపెట్టి హారతిఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. చెక్కుల పంపిణీ అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వారి పరిస్థితిని దగ్గరుండి చూసిన అనుభవంతో దేశంలో ఎక్కడాలేని విధంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి నిరుపేద ఆడపిల్లల పెండ్లిళ్లకు మేనమామగా మా రారని కొనియాడారు.
ఎమ్మెల్యేకు చక్కెర కుడుకలు..
తెలంగాణ సర్కారు వర్తింపజేస్తున్న పథకాలతో అన్నిపార్టీల నేతలు సంతోషంగా ఉన్నారని చెప్పడానికి ఈ ఉదంతమే నిదర్శనంగా నిలుస్తున్నది. గురువారం రాగంపేటలో కాంగ్రెస్‌పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి భూస భూమయ్య సతీమణి లక్ష్మికి చెక్కు పంపిణీ చేసి, చీరెను, బీజేపీ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు శ్రీపాదరవీందర్ సతీమణి లలితకు కల్యాణలక్ష్మిచెక్కు, చీరెను ఎమ్మెల్యే సుంకెరవిశంకర్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు లక్ష్మి-భూమయ్య దంపతులు టవల్ కప్పి, చక్కెర కుడుకలు పోసి ఆత్మీయతను చాటుకున్నారు. బిడ్డపెండ్లికి లక్షానుటపదహారు రూపాయల కట్నం పెట్టిన కేసీఆర్‌కు రుణపడి ఉంటామని చెప్పారు.
కార్యక్రమంలో జిల్లాగ్రంథాలయసంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంపీపీ చిలుకరవీందర్, సింగిల్‌విండో చైర్మన్లు వెల్మ మల్లారెడ్డి, మినుపాల తిరుపతిరావు, మార్కెట్‌కమిటీ చైర్మన్ ఆరెల్లి చం ద్రశేఖర్‌గౌడ్, సర్పంచ్‌లు మామిడి లత-రాజేశం, గుంటరవి, సురేశ్, వెల్మ నాగిరెడ్డి, శంకర్, ఎంపీటీసీ సింగిరెడ్డి కిష్టారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మం డలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోకరాజేశ్వర్రెడ్డి, మాజీ ఎంపీపీ వల్లాల క్రిష్ణహరి, కోఆప్షన్ పాషా, ఆర్ఎస్ఎస్ జిల్లాసభ్యుడు మచ్చ రమేశ్, మండల కన్వీనర్ గుడిపాటి వెంకటరమణారెడ్డి, నేతలు మాచర్ల వినయ్‌కుమార్, నలుమాచు రామక్రిష్ణ, ఎడవెల్లి జనార్దన్, కుందేళ్ల బాలకిషన్, కళ్లెం రవీందర్‌రెడ్డి, కళ్లెం లచ్చిరెడ్డి, బత్తిని బుచ్చయ్య, మావూరం మహేశ్, మారం యువరాజు, రవితేజ, చోటు,పబ్బశ్రీను, ఆశోద రాజయ్య, బీసవేని రాజశేఖర్ పాల్గొన్నారు.