బోయినపల్లి, ఏప్రిల్ 27: పేద ప్రజలకు కంటి చూపునిస్తున్న కొదురుపాక బీసీఎం కంటి దవాఖాన సేవలు అభినందనీయమని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జోగినపల్లి రవీందర్రావు పేర్కొన్నారు. బూర్గుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొదురుపాక కంటి దవాఖాన ఆధ్వర్యంలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించగా జోగినపల్లి రవీందర్రావు ప్రారంభించి మాట్లాడారు. హైదరాబాద్ లాంటి పట్టణాల్లో అందించే కార్పొరేట్ వైద్యం కొదురుపాక కంటి దవాఖానలో అందించడం పేద ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. కొదురుపాకకు చెందిన ప్రముఖ కంటి వైద్య నిపుణుడు డా. వైరాగ్యం రాజలింగం, డా. రీటా బహుదుర్షాలు స్వగ్రామంపై ఉన్న మమకారంతో కంటి దవాఖాన నిర్మాణం చేసి పేద ప్రజలకు ఉచిత కంటి ఆపరేషన్లు చేయడం చాల సంతోషమని ఆయన కొదురుపాక గ్రామస్తుడైనందుకు గర్వంగా ఉన్నదని చెప్పారు.
ఈ ఉచిత వైద్య శిబిరంలో కంటి వైద్యుడు డా. వంశీ చక్ర 200 మందికి కంటి పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో కొదురుపాక బీసీఎం కంటి దవాఖాన సభ్యుడు రవిచందర్, మండల ఆర్బీఎస్ అధ్యక్షుడు కొనుకటి లచ్చిరెడ్డి, సెస్ డైరెక్టర్ మేడుదుల మల్లెశం, కొండగట్టు ఆలయ కమిటీ సభ్యుడు ముద్దం రవి, సర్పంచ్ అతికం లచ్చయ్య, తడగొండ సర్పంచ్ చిందం రమేశ్, దుండ్రపల్లి ఇన్చార్జి సర్పంచ్ వంగ రవి, ఉప సర్పంచ్ చంద్రయ్య, మండల టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గుంటి శంకర్, టీఆర్ఎస్ నాయకులు పెరుక మహేశ్, రామంచ బాబు, ఎడపల్లి బాబు, నల్లగొండ అనీల్, బొజ్జ నరేశ్, గుడి శ్రీనివాసరెడ్డి ఉన్నారు.