చిగురుమామిడి, ఏప్రిల్ 27: ధాన్యం రైతులు దళారులను నమ్మి నష్టపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి సూచించారు. మండలంలోని నవాబుపేట గ్రామంలో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ ప్రారంభించి మాట్లాడారు. రైతులు నాణ్యమైన వరి ధాన్యాన్ని సెంటర్ తీసుకువచ్చి నిర్వాహకులకు సహకరించాలని కోరారు. కొనుగోళ్లలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ కరివెద మహేందర్ రెడ్డి, సర్పంచులు కానుగంటి భూమారెడ్డి, సన్నీళ్ల వెంకటేశ్, సుద్దాల ప్రవీణ్, చెప్యాల మమత, బోయిని శ్రీనివాస్, ముప్పిడి వెంకట నరసింహారెడ్డి, పిట్టల రజిత శ్రీనివాస్, పెద్దపెల్లి భవానీ అరుణ్ పటేల్, గోలి బాపు రెడ్డి, ఎంపీటీసీ రావుల రమేశ్ పటేల్, మిట్టపల్లి మల్లేశం, పెసరి జమున రాజేశం, మంకు స్వప్నాశ్రీనివాస్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు మక్బూల్ పాషా, రైతు సంఘం జిల్లా నాయకులు సాంబారి కొమురయ్య, కొమర భూపతిరెడ్డి, ఉప సర్పంచులు కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, రాజయ్య, పోచయ్య, కిషన్ రెడ్డి, సహకార సంఘం సీఈవో కాటం నరసయ్య, సింగిల్ విండో డైరెక్టర్లు చిట్టుమల్ల శ్రీనివాస్, తాళ్లపల్లి తిరుపతి గౌడ్, కూతురు రవీందర్ రెడ్డి, అందే స్వామి, మాచమళ్ల లచ్చవ్వ, చాడ శ్రీధర్ రెడ్డి, పేరాల లక్ష్మి, పోతరవేణి శ్రీనివాస్, భాసర్ రెడ్డి, బండి లక్ష్మి, ఆర్బీఎస్ కోఆర్డినేటర్లు తాడ శ్రీనివాస్ రెడ్డి, ఆజేందర్ రెడ్డి, చాడ వేణు, సత్యనారాయణ, బోయిని మనోజ్, సుధగోని శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
ఏరడపల్లి, ఇప్పలపల్లిలో..
శంకరపట్నం, ఏప్రిల్ 27: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తాడికల్ పీఏసీఎస్ చైర్మన్ కేతిరి మధూకర్‌రెడ్డి కోరారు. బుధవారం తాడికల్ సింగిల్ విండో పరిధిలోని ఏరడపల్లి, ఇప్పలపల్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం మద్దతు ధర అందజేస్తున్నట్లు తెలిపారు. రైతులు కేంద్రాలకు ధాన్యం తెచ్చే సమయంలో నిర్దేశించిన తేమ శాతం ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో పీఏసీఎస్ వైస్ చైర్మన్ నరహరి వెంకటరమణారెడ్డి, సర్పంచులు కలకుంట్ల రంజిత్‌రావు, బైరి సంపత్, డైరెక్టర్లు, రైతులు, హమాలీలు, తదితరులు పాల్గొన్నారు.