కమాన్‌చౌరస్తా, ఏప్రిల్ 27 : కామర్స్ విద్యార్థులు పరిశోధనపై ఆసక్తి పెంచుకొని, వ్యాపార, పారిశ్రామిక రంగం, సమాజం ఎదురొంటున్న వివిధ సమస్యలకు పరిషార మార్గాలను చూపాలని శాతవాహన విశ్వవిద్యాలయం కామర్స్, మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్, కామర్స్ విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ డీ హరికాంత్ పేర్కొన్నారు. ఎస్సారార్ కళాశాల కామర్స్ విభాగం నిర్వహించిన పరిశోధనపై ఒక రోజు వర్క్‌షాప్‌నకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీకాం విద్యార్థులు వ్యాపార, పారిశ్రామిక రంగంలో వస్తున్న మార్పులను నిశితంగా పరిశీలించాలన్నారు. ప్రిన్సిపాల్ రామకృష్ణ మాట్లాడుతూ, డిగ్రీ స్థాయిలోనే పరిశోధనా పద్ధతులను సబ్జెక్టుగా నిర్దేశించడంతో విద్యార్థులు ఆర్థిక, సామాజిక, మారెటింగ్, మానవ వనరులకు సంబంధించిన అంశాలపై లోతుగా అధ్యయనం చేయవచ్చన్నారు.
వర్క్‌షాప్ డైరెక్టర్, కామర్స్ విభాగాధిపతి భిక్షపతి మాట్లాడుతూ ఈ కార్యశాల విద్యార్థుల పరిజ్ఞానాన్ని, నైపుణ్యతను మరింత పెంచుతుందన్నారు. కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కామర్స్ విభాగాధిపతి డాక్టర్ టీ లావణ్య, జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాళాల కామర్స్ విభాగాధిపతి, ఐక్యూఏసీ సమన్వయకర్త డాక్టర్ హర్జోత్ కౌర్ ప్రతిచయన, దత్తాంశ సేకరణ పద్ధతులు, దత్తాంశ విశ్లేషణ, నివేదిక తయారీపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ హిమబిందు, అధ్యాపకులు టీ లావణ్య, హర్జోత్ కైర్, భిక్షపతి, మల్లారెడ్డి, ఏ ప్రసాద్, నారాయణ, చంద్రమౌళి, ఓదెలు కుమార్, లక్ష్మీనర్సయ్య, సతీశ్, నర్మద, రాములు, మల్లేశం, రాములు, రాజు, పూర్ణచందర్, రమేశ్, ఆంజనేయులు, ప్రేమ్‌చంద్ పాల్గొన్నారు.