చొప్పదండి, ఏప్రిల్ 26: పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి పట్టణానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త రామగిరి శివ ప్రమాదవశాత్తు మరణించగా, పార్టీ తరఫున రూ.2 లక్షలు బీమా సొమ్ము మంజూరైంది. కాగా, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మంగళవారం శివ ఇంటికి వెళ్లి బాధిత కుటుంబసభ్యులకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేనివిధంగా కార్యకర్తల కుటుంబానికి అండగా ఉంటున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని కొనియాడారు. పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తూ మరణిస్తే వారి కుటుంబానికి బీమా కింద ఇస్తున్న రూ.2 లక్షలు కొండంత భరోసానిస్తున్నాయని పేర్కొన్నారు.
శివ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, సింగిల్‌విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, సర్పంచులు గుంట రవి, సురేశ్, మాజీ ఎంపీపీ వల్లాల కృష్ణహరి, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రాజయ్య, కుమార్, పద్మ, నర్సయ్య, ఆర్బీఎస్ జిల్లా సభ్యులు గడ్డం చుక్కారెడ్డి, మచ్చ రమేశ్, కౌన్సిలర్ కొత్తూరి మహేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు బందారపు అజయ్‌కుమార్‌గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, గుడిపాటి వెంకటరమణారెడ్డి, గాండ్ల లక్ష్మణ్, బత్తిని సంపత్, ఐలయ్య, మహేశుని మల్లేశం, దండె కృష్ణ, మావురం మహేశ్, ఐలయ్య, కొత్తూరి నరేశ్ తదితరులు పాల్గొన్నారు.