చొప్పదండి/రామడుగు/గంగాధర, ఏప్రిల్ 26: రైతుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో, రామడుగు, గోపాల్రావుపేటలో, గంగాధర మండలం గర్శకుర్తి, ఆచంపల్లి, చిన్నఆచంపల్లి, తాడిజెర్రి, కొండన్నపల్లి, కురిక్యాల, మధురానగర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లోనే రైతుల ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని సూచించారు.
అంతర్జాతీయంగా పారా బాయిల్డ్ రైస్‌కు ఉన్న డిమాండ్‌ను అంచనా వేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. యాసంగి వడ్లు కొనుగోలు చేయకుండా కేంద్రం మొండికేసినా, రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర సర్కారు కొనుగోలు చేస్తుందని ప్రకటించి సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిగా నిలిచారని కొనియాడారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. చొప్పదండి నియోజకవర్గం కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలంగా మారిందన్నారు.
ఈ కార్యక్రమాల్లో చొప్పదండి ఎంపీపీ చిలుక రవీందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, సింగిల్‌విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, మార్కెట్‌కమిటీ వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, సర్పంచులు గుంట రవి, సురేశ్, మాజీ ఎంపీపీ వల్లాల కృష్ణహరి, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, మార్కెట్డైరెక్టర్లు రాజయ్య, కుమార్, పద్మ, నర్సయ్య, ఆర్బీఎస్ జిల్లా సభ్యులు గడ్డం చుక్కారెడ్డి, మచ్చ రమేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు బందారపు అజయ్‌కుమార్‌గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, గుడపాటి వెంకటరమణారెడ్డి, గాండ్ల లక్ష్మణ్, బత్తిని సంపత్, ఐలయ్య, మహేశుని మల్లేశం, దండె కృష్ణ, మావురం మహేశ్, తహసీల్దార్ రజిత, రామడుగులో ఏఎంసీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, కొండగట్టు దేవస్థానం బోర్డు డైరెక్టర్ దాసరి రాజేందర్‌రెడ్డి, సింగిల్‌విండో వైస్ చైర్మన్ గంట్ల రవీందర్‌రెడ్డి, ఏపీఎం ప్రభాకర్, రామడుగు సర్పంచ్ పంజాల ప్రమీల, గోపాల్రావుపేట ఎంపీటీసీ ఎడవెల్లి కరుణశ్రీ, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు జవ్వాజి శేఖర్, ఏఎంసీ డైరెక్టర్లు మచ్చ గంగయ్య, పైండ్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు వేల్పుల హరికృష్ణ, నాయకులు కొడిమ్యాల రాజేశం, తడగొండ నర్సింబాబు, మామిడి తిరుపతి, ఎడవెల్లి పాపిరెడ్డి, ఆనంద్‌రెడ్డి, ఎన్ అంజయ్యగౌడ్, పూడూరు మల్లేశం, ముదుగంటి రాజిరెడ్డి, కర్ర రాజిరెడ్డి, మాదం రమేష్, కరబూజ తిరుపతిగౌడ్, లేఖరాజు, చాడ ప్రభాకర్‌రెడ్డి, పంజాల జగన్మోహన్గౌడ్, రాజమౌళి, గంగాధర మండలంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాగి మహిపాల్‌రావు, సింగిల్ విండో చైర్మన్లు వెలిచాల తిర్మల్‌రావు, దూలం బాలాగౌడ్, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్‌గోపాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ వేముల భాస్కర్, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ పుల్కం గంగన్న, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, సర్పంచులు అలువాల నాగలక్ష్మి, రామిడి కనకమ్మ, కొంకటి శంకర్, దోర్నాల హన్మంతరెడ్డి, రేండ్ల జమున, వేముల లావణ్య, వేముల దామోదర్, మడ్లపెల్లి గంగాధర్, ఎంపీటీసీ కోలపురం లక్ష్మణ్, తడిగొప్పుల రజిత, ద్యావ మధుసూదన్‌రెడ్డి, నాయకులు కరబూజ తిరుపతిగౌడ్, అలువాల తిరుపతి, తడిగొప్పుల రమేశ్, దూలం శంకర్‌గౌడ్, రామిడి సురేందర్, రేండ్ల శ్రీనివాస్, వేముల అంజి, పెంచాల చందు, సామంతుల శ్రీనివాస్, గంగాధర కుమార్ పాల్గొన్నారు.