గోదావరిఖని, ఏప్రిల్ 25: తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టీఆర్ఎస్ అని రామగుండం ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఉద్ఘాటించారు. సీఎం కేసీఆర్ పోరాటం, అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ సిద్ధించిందని చెప్పారు. ప్రజలను, దేశంలోని అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి గుండెల్లో గులాబీ జెండా ఉన్నదన్నారు. అనేక పథకాలతో సీఎం కేసీఆర్ దేశానికే స్ఫూర్తిదాయకమైన పాలనను అందిస్తున్నారని చెప్పారు. రాష్ర్టాన్ని సంక్షేమానికి చిరునామాగా మార్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 27న వాడవాడలా ఘనంగా జరుపుకోవాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేయర్ డా.అనిల్‌కుమార్, జడ్పీటీసీ ఆముల నారాయణ, వైస్ ఎంపీపీ స్వామి, నాయకులు మూల విజయారెడ్డి, పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు ఇంజపురి పులెందర్, ధాతు శ్రీనివాస్, పెంట రాజేశ్, కన్నూరి సతీశ్, అడ్డాల స్వరూప, కృష్ణవేణి, కుమ్మరి శ్రీనివాస్, దొంత శ్రీనివాస్, వేణుగోపాల్, గట్టయ్య, బాల రాజ్‌కుమార్, శంకర్ నాయక్, జెట్టి జ్యోతి, బొడ్డు రవీందర్, రాకం వేణు, సర్పంచులు సతీశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లం రాజన్న, మామిడాల ప్రభాకర్ చెప్యాల రామారావు, జేవీ రాజు, కాల్వ శ్రీనివాస్, గడ్డి కనకయ్య, గంగ శ్రీనివాస్, తిరుపతి ఉన్నారు.